- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి పెద్దిరెడ్డి ఇలాకలో అమూల్‌కు నో ఎంట్రీ.. కారణం చెప్పిన Nara Lokesh
దిశ, తిరుపతి: పుంగనూరుకు ఎప్పుడు వెళ్లినా గుర్తుకు వచ్చేది పెద్దిరెడ్డి పాపాలు, ఆయన చేస్తున్న అరాచకాలు అని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర పుంగనూరు నియోజకవర్గం కొత్తపేటలో సాగింది. ఈ సందర్బంగా భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ పాడి, మామిడి రైతులను పెద్దిరెడ్డి తీవ్రంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అమూల్ సంస్ధ పాలు సేకరిస్తున్నా.. పుంగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశం లేదని పేర్కొన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంస్ధ శివశక్తి డైరీకి లబ్ధి చేకూర్చేందుకు పుంగనూరులోకి అమూల్ సంస్ధను పాలు సేకరించకుండా నిలిపివేశారని లోకేశ్ ఆగ్రహించారు.
వైసీపీలో తీవ్ర వణుకు..
తన 33 రోజుల పాదయాత్రకే వైసీపీలో తీవ్ర వణుకు పుట్టిందని లోకేశ్ విమర్శించారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు వైసీపీ వాళ్లు నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఆఖరికి మాట్లాడేందుకు వేసుకున్న స్టూల్‌ను కూడా లాక్కుంటున్నారని మండిపడ్డారు. ‘జాబ్ క్యాలెండర్ కోసం యువత ఆశగా ఎదురుచూసి అలసిపోయింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. సంపూర్ణ మద్యపాన నిషేధమన్నారు. ఇప్పటికీ ఆ విషయం గురించి ఏమైందో జగనే చెప్పాలి. గంజాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది.’ అని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.