- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirumala: వైకుంఠ ద్వార దర్శనానికి పటిష్ట ఏర్పాట్లు
దిశ తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2 నుంచి 11 వరకు సామాన్య భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ అదనపు ఈవో(ఎఫ్ఏసి) వీరబ్రహ్మంతో కలిసి ఛైర్మన్ బుధవారం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు, సర్వదర్శనం క్యూలైన్లు, పీఎసీ-4 తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరం, వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠం క్యూకాంప్లెక్సు, నారాయణగిరి షెడ్లు, ఇతర ప్రాంతాల్లో అన్నప్రసాదాలు, తాగునీరు, టీ, కాఫీ విస్తృతంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేపడుతున్నట్టు తెలిపారు. భక్తులు తిరుపతిలో టైంస్లాట్ టోకెన్లు పొంది వైకుంఠ ద్వార దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా త్వరితగతిన దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేశారు. సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 1 నుంచి 11వ వరకు బ్రేక్ దర్శనాల కోసం వీఐపీల సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలియజేశారు. స్వయంగా వచ్చే వీఐపీలకు బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు.
కోవిడ్ మళ్ళీ వ్యాపిస్తున్న పరిస్థితులు నెలకొన్నందువల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు భక్తులందరూ తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదం కాంప్లెక్స్‌తో పాటు జనవరి ఒకటో తేదీ నుంచి ప్రధాన కల్యాణ కళ్యాణ కట్ట ఎదురుగా ఉన్న పీఏసీ-4లో అన్న ప్రసాద వితరణ ప్రారంభిస్తామని తెలియజేశారు.