చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడి కటాక్షం

by Javid Pasha |
చిన్నశేష వాహనంపై శ్రీ కోదండరాముడి కటాక్షం
X

దిశ, తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం ఉదయం చిన్నశేష వాహనంపై శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు. ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు వాహనసేవ జరిగింది. గజరాజులు ముందు కదులుతుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం

వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు . ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, విజివో మనోహర్, ఏఈవో మోహన్, సూపరింటెండెంట్‌ రమేష్‌, కంకణభట్టర్ ఆనందకుమార దీక్షితులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు చలపతి, సురేష్, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed