- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tirupati: ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. నారాయణ అండ్ కో చిత్రం హీరో తీవ్ర ఆవేదన
దిశ, తిరుపతి: నేటి పరిస్థితుల్లో చిన్న చిత్రాన్ని పూర్తి చేయాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు పడాలని నారాయణ అండ్ కో చిత్రం హీరో సుధాకర్ అన్నారు. నారాయణ అండ్ కో చిత్ర బృందం తిరుపతి లీలామహల్ కూడలిలోని హోటల్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మంచి కెమెరాతో క్వాలిటీ మిస్ కాకుండా ఫ్యామిలీ మొత్తం నవ్వుకోగలిగే సినిమాను రూపొందించామని హీరో సుధాకర్ తెలిపారు.
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశామన్నారు. 6 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ చూసే చిత్రమని చెప్పారు. ప్రేక్షకులంతా చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈనెల 30న విడుదల కానున్న ఈ చిత్రంలో సీనియర్ నటులు సప్తగిరి, ఆమని, దేవి ప్రసాద్ తదితరులు నటించారన్నారు. ఇదివరకే ఓ సాంగ్‌ని రిలీజ్ చేశామని, అది ప్రేక్షకుల ఆదరణ పొందిందన్నారు. ఒక్కో పాటను వేరువేరు మ్యూజిక్ డైరెక్టర్‌లతో రూపొందించామన్నారు. ఈ చిత్రంపై తాము చాలా ఆశలు పెట్టుకున్నామని, తమ చిత్ర బృందాన్ని ఆశీర్వదించాలని హీరో సుధాకర్ కోరారు.