- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీటీడీ భవన్‌లో అగ్నిప్రమాదం.. ఎమ్మెల్యే శ్రీనివాసులు కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి టీటీడీ పరిపాలనా భవన్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని చిత్తూరు జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. టీటీడీ పరిపాలనా భవన్‌లో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విభాగంలోని ఒక సెక్షన్ డీఈ పరిధిలో ప్రమాదం జరిగిందన్నారు. పలువురు విజిలెన్స్ అధికారులకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అగ్నిప్రమాదం జరగడంపై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. మదనపల్లె ఘటన మరువకముందే మరో అగ్నిప్రమాదం జరగడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వరుస అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. తప్పు చేసిన వాళ్లకు చట్ట శిక్ష తప్పదని హెచ్చరించారు. నిందితులను వెంకటేశ్వర స్వామి కచ్చితంగా శిక్షిస్తారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు.