- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vedanta: కాపర్ ప్లాంట్ రీ-ఓపెన్ చేయడంపై వేదాంత రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
దిశ, బిజినెస్ బ్యూరో: తమిళనాడులోని తూత్తుకుడిలో కాపర్ స్మెల్టింగ్ ప్లాంట్‌ను తిరిగి తెరవాలని కోరుతూ వేదాంత లిమిటెడ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పర్యావరణ, ప్రజారోగ్య సమస్యల కారణంగా 2018, మే నుంచి ఈ ప్లాంటును మూసివేశారు. దేశ రాగి ఉత్పత్తిలో కీలకంగా ఉన్న వేదాంత స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ గాలి, నీటి కాలుష్యం సహా పర్యావరణ ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలను ఎదుర్కొంది. దీనిపై స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 2018, మే 22న ఈ ప్లాంట్‌ను మూసేందుకు జరిగిన నిరసనల్లో పోలీసుల కాల్పులకు 13 మంది బలయ్యారు. మరెంతోమంది గాయపడ్డారు. దాంతో అప్పట్లో తమిళనాడు ప్రభుత్వం ప్లాంటును మూసేయాలని ఆదేశించింది. ఆ తర్వాత 2020, ఆగష్టులో తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సైతం సమర్థించింది. అనంతరం హైకోర్టు తీర్పుపై ఈ ఏడాది ఫిబ్రవరి 29న వేదాంత అప్పీల్‌ను సుప్రీంకోర్టు నిరాకరించింది. తాజాగా రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన వేదాంతకు మరోసారి చుక్కెదురైంది.