Breaking: తిరుపతి జూకు పులి పిల్లల తరలింపు

by srinivas |   ( Updated:2023-03-09 17:16:22.0  )
Breaking: తిరుపతి జూకు పులి పిల్లల తరలింపు
X

దిశ, కర్నూలు ప్రతినిధి: మూడ్రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఫారెస్ట్ అధికాలు తెర దించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో గుర్తించిన 4 పులి పిల్లలను తిరుపతి జూకు తరరించారు. తల్లిపులితో చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో పులి పుల్లల ఆరోగ్యం దృష్ట్యా అటవీ అధికారులు జూకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు నాలుగు పులి పిల్లలను అత్యంత భద్రత నడుమ జూకు తరలించారు.

కాగా పులిపుల్లలు లభ్యమైనప్పటి నుంచి తల్లి పులి కోసం అటవీ అధికారులు 300 మంది సిబ్బంది, 40 ట్రాప్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పెద్ద గుమ్మడాపురం - ముసలిమడుగు పరిసర అటవీ ప్రాంతంలో తల్లి పులి కనిపించింది. దీంతో పులి పిల్లలను కలిపే ప్రయత్నం చేశారు. అది కాస్త విఫలం కావడంతో ఆత్మకూరు నుంచి తిరుపతి జూకు తరలించారు. పిల్లలకు బాయిలర్ లివర్ పీసులు పెట్టడం, రసాయనాలు కలసిన పాలు ఇవ్వ డంతో వాటి ఆరోగ్యంపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో కూనల పరిస్థితి మరింత క్షీనిస్తుందని భావించిన అధికారులు మరోసారి తల్లిపులితో కలిపే ప్రయత్నం చేస్తామని చెప్పి ఊహించని విధంగా తిరుపతి జూకు తరలించారు. అయితే పులి పిల్లలను తల్లి చెంతకు చేర్చకుండానే జూకు తరలించడం పట్ల జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed