- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:శ్రీవారిని దర్శించుకున్న పలువురు ఎమ్మెల్యేలు
దిశ, తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కూటమి ఎమ్మెల్యేలు గాలి భానుప్రకాష్,దామచర్ల జనార్దన్,ఆరణి శ్రీనివాసులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్యేలు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలకు రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ఫలితాలు ఏకపక్షంగా ఇచ్చారని, నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలు పెద్ద బాధ్యతను అప్పగించారని నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ అన్నారు.
శ్రీవేంకటేశ్వర స్వామి దయ వల్ల ప్రజలకు మంచి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఎన్డీయే కూటమిలో తెలుగు దేశం పార్టీ పెద్ద భాగస్వామ్యంగా నిలుస్తోందని, ఇది మన రాష్ట్రానికి శుభ సూచిక అని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ దీవెనలతో తిరుపతి ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కలిగిందని ఆరణి శ్రీనివాసులు చెప్పారు. తిరుమల తిరుపతి పవిత్రను జాగ్రత్తగా కాపాడుతానని, నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నానన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల భక్తి భావానికి అనుగుణంగా తిరుపతిలో పని చేస్తానన్నారు. కుటుంబ సమేతంగా తిరుపతి ప్రజలు ఓట్లు వేసి అత్యధికంగా మెజారిటీ ఇచ్చారన్నారు.నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల సలహా మేరకు తిరుపతిని అభివృద్ధి చేస్తానని ఆరణి తెలిపారు.