శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న కన్నప్ప టీమ్.. మోహన్ బాబు ఏం మాట్లాడారంటే..!

by srinivas |   ( Updated:2025-02-26 12:24:15.0  )
శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న కన్నప్ప టీమ్.. మోహన్ బాబు ఏం మాట్లాడారంటే..!
X

దిశ, వెబ్ డెస్: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి(Mahashivratri) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని శైవ క్షేత్రాలు(Shaiva Kshetras) భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు శ్రీకాళహస్తి(Srikalahasti), శ్రీశైలం, వేములవాడ, కీసరతో పాటు తదితర ఆలయాలకు భక్తులు పోటెత్తారు. అటు శ్రీకాళహస్తిలో కూడా శివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్(Srikalahasti MLA Bojjala Sudhir) స్వయంగా దగ్గరుండి భక్తుల దర్శనాల ఏర్పాట్లు చూస్తున్నారు. మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన కన్నప్ప మూవీ ఏప్రిల్ 25న విడుదల కాబోతోంది. మహా శివరాత్రి సందర్భంగా ఈ రోజు శ్రీకాళస్తీశ్వరుడి(Srikalastheeswaru)ని సినిమా యూనిట్ దర్శించుకుంది. మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu)తో పాటు విష్ణు, డాన్స్ మాస్టర్ ప్రభు దేవా(Master Prabhu Deva) శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. కన్నప్ప సినిమా(Kannappa Movie) విజయం సాధించాలని కోరుతున్నారు.


ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ ‘‘శ్రీకాళహస్తి ఆలయం అలకరణ కళా నైపుణ్యంలా ఉంది. అతిశయోక్తికాదు. ఈ క్రెడిట్ అంతా ఎమ్మెల్యే బొజ్జలదే. నాకు అత్యంత ఆత్మీయుడైన తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నారు. ఈశ్వరుడి గురించి తెలియని వాళ్లుండరు. ఆ భగవంతుడి ఆశీస్సులతో కన్నప్ప సినిమా తీస్తున్నాం. సినిమా రిలీజ్ తర్వాత అన్ని విషయాలు మాట్లాడతా. కన్నప్ప టీమ్ అంతా శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకుంది. కన్నప్పగా విష్ణుగా నటించారు. పరమేశ్వరుడి అశీర్వాదం ప్రజలకు, తమకు, తమ సినిమా ఉండాలి.’’ అని కోరుకున్నారు.

Next Story