- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tirupati: ఎట్టకేలకు చిక్కిన చిరుత పులి
దిశ తిరుపతి: తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులు చిరుత పులి సంచారంతో విద్యార్ధులు హడలి పోతున్నారు. ఇటీవల ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ బంగ్లాలో ప్రవేశించిన చిరుత ఓ కుక్కనుఎత్తుకెళ్ళి చంపి తినడంతో యూనివర్సిటీలో హాస్టల్స్‌లో ఉండే విద్యార్ధిని, విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. అయితే యూనివర్సిటీలో చిరుత పులి సంచారం సంబంధించిన సీసీ పుటేజ్ వీడియోలను అటవీ శాఖా అధికారులకు తెలియజేయడంతో వీసీ బంగ్లా వెనుక వైపు బోన్లు ఏర్పాటు చేశారు. రెండు వేర్వేరు ప్రదేశాల్లో బోన్లను ఏర్పాటు చేయడంతో పాటుగా దాదాపు 6 కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో చిరుతపులి బోనుకు చిక్కింది.
అయితే చిక్కిన చిరుత పులిని దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతంలో వదిలేందుకు అటవీ శాఖా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక చిరుత పులి సంచారంతో తిరుపతి రూరల్ మండలంమైన లక్ష్మీపల్లె, పెరుమాళ్ళపల్లి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. శేషాచల అటవీ ప్రాంతం దగ్గరలో గ్రామాలు ఉండడంతో తరచూ రాత్రి సమయాల్లో చిరుత పులులు గ్రామాల్లో సంచరించి కుక్కలను వేటాడి చంపితింటున్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించి తమకు రక్ష కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.