తిరుమలలో భారీ వర్షం.. 20 నిమిషాలపాటు కుండపోత వాన

by srinivas |
తిరుమలలో భారీ వర్షం.. 20 నిమిషాలపాటు కుండపోత వాన
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో భారీ వర్షం (Huge Rain) కురిసింది. సాయంత్రం 5 గంటల సమయంలో 20 నిమిషాలపాటు ఒక్కసారిగా వరుణుడు విరుచుకుపడ్డారు. దీంతో తిరుమల(Tirumala) మొత్తం నీటిమయం అయింది. శ్రీవారి ఆలయం(Srivari Temple) సమీపంలోని లోతట్టు ప్రాంతం వైపు వరద నీరు భారీగా ప్రవహించింది. మాడవీధుల్లోనూ అడుగుమేర నీరు ఉధృతంగా ప్రవహించింది. శ్రీవారి క్యూలైన్ వద్ద ఉన్న భక్తులు ఇబ్బందులు పడ్డారు. చివరకు వరుణుడు శాంతించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Next Story