- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:కలకత్తా ఘటన పై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యుల ఆందోళనలు
by Jakkula Mamatha |
X
దిశ,శ్రీకాళహస్తి:కలకత్తాలోని మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిపి హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని శ్రీకాళహస్తిలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. స్థానిక ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఓపి విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లకు, సిబ్బందికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఆవరణలో పోలీస్ ఔట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూడా పట్టణంలో నిరసన ర్యాలీ జరిగింది. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్, యూనియన్ నాయకులు చందు, ప్రసాద్, బాబి, చైతు, ముఖేష్, దినేష్‌లు కూడా పాల్గొన్నారు.
Advertisement
Next Story