- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్‌ఆర్‌ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chittoor: సొంత ఇంట్లోనే చిచ్చు.. రగులుతున్న రగడ
దిశ, చిత్తూరు: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ప్రజలు నిలదీస్తుంటే, మరోవైపు సొంత మేనల్లుళ్లే ఆయనకు చెక్ పెడుతున్నారు. ఆర్.సుబ్రహ్మణ్యం, రమేశ్ మేనల్లుళ్లు కావాడంతో మొన్నటివరకు నారాయణ స్వామికి వ్యక్తిగత కార్యదర్శులుగా పని చేశారు. అయితే ఇటీవల కాలంలో వారిద్దరిని నారాయణ స్వామి తొలగించారు. దీంతో నారాయణస్వామి పట్ల తన ఇద్దరు మేనల్లుళ్లు అసంతృప్తితో ఉన్నారు.
అంతేకాదు స్థానిక నాయకులను పర్సనల్‌గా కలవడమే పనిగా పెట్టుకున్నారు. నారాయణస్వామి బద్ధశత్రువుగా భావించే మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు(ఎన్‌ఆర్‌ఐ) మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డిని కలిసి శాలువా కప్పారు. శనివారం పాలసముద్రం మండలంలోని ఎంపీపీ శ్యామల భర్త శివప్రకాశ్‌రాజును కలిశారు. వైస్‌ఎంపీపీ శేఖర్‌ని, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరెడ్డి, జడ్పీటీసీ అన్భు, సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, కేశవరెడ్డి తదితరులను కలసి మద్దతు కోరారని తెలిసింది. గంగాధరనెల్లూరు మండలంలో సీనియర్ నాయకులు వేల్కూరు బాబురెడ్డి, మరి కొందరిని కలిశారు. వెదురుకుప్పం మండలంలో బొమ్మయ్యపల్లె ఎంపీటీసీ కొత్తపల్లి భాస్కర్‌ని కలిశారు. అసంతృప్త నేతలందరినీ ఒక్క తాటిమీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే జిల్లాలో ఇద్దరు ప్రముఖులను కలశారని, రానున్న ఎన్నికల్లో వైసీపీ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే టికెట్‌ను తనకు ఇప్పించాలని నారాయణ స్వామి మేనల్లుడు సుబ్రహ్మణ్యం అభ్యర్థించారని కూడా ప్రచారం జరుగుతోంది. నారాయణ స్వామి మేనల్లుళ్లే ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.