- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ap News: డిప్యూటీ సీఎంను నిలదీసిన నిరుద్యోగులు... దెబ్బతో కులం, పార్టీ పేరుతో రివర్స్ క్వశ్చన్స్
దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి చిత్తూరు జిల్లా గురవరాజుగుంటలో నిరసన సెగ ఎదురైంది. ఈ ఉదయం ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ స్వామి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై వివరించే ప్రయత్నం చేశారు. అయితే స్థానికులు, నిరుద్యోగులు అడ్డుకున్నారు. అభివృద్ధిపై స్థానికులు, డీఎస్పీపై నిరుద్యోగులు డిప్యూటీ సీఎంను నిలదీశారు. టీచర్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రశ్నించారు.
అయితే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అనుచరులు స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీది ఏ కులం, ఏ పార్టీ’ అంటూ స్థానికులతోపాటు, నిరుద్యోగులపైనా మండిపడ్డారు. దీంతో డిప్యూటీ సీఎం తీరుపై స్థానికులు, నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు అడిగితే పార్టీ, కులం ప్రస్థావన తెస్తారా.. అని మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ప్రతి ఏడాది జాబ్ కేలండర్ ప్రకటిస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రశ్నిస్తే తమపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తారా? అంటూ నిరుద్యోగులు వాపోయారు.