- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tirupati: దురదృష్టకరం.. తీవ్రంగా కండిస్తున్నాం: సీపీఐ నారాయణ
దిశ, తిరుపతి: భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్ల బిల్లు తీసేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం ప్రజా స్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సోమవారం ఆయన ఓ వీడియో విడుదల చేస్తూ కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్ తీసేస్తామని హోంమంత్రి చెప్పడాయన్ని ఆయన తప్పుబట్టారు. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అన్ని మతాల్ని, కులాలను కలుపుకుని పోవాలని కీలక సమావేశాల్లో చెప్పారని గుర్తు చేశారు. అధికారం కోసం పాకులాడే వాళ్ళు రాజకీయాల్లో విమర్శలు చేసుకోవచ్చన్నారు. అలా కాకుండా మతతత్వాలు రెచ్చగొట్టడం ఏంటని ప్రశ్నించారు.
గతంలో సీపీఐ నాయకులు చండ్రరాజేశ్వర్ రావు ముస్లింల స్థితి గతులు పరిశీలించినప్పుడు దళితులు, గిరిజనుల కంటే ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పారన్నారు. అంతేకాకుండా సచార, శ్రీరంగరాజ కమిటీ పరిశీలనలో కూడా ముస్లింలు ఎక్కువ శాతం పేదరికంలో ఉన్నారని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. గతంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో 5 శాతం నుంచి 4 శాతానికి రిజర్వేషన్లు తగ్గించినట్లు చెప్పారు. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న హోమ్ మంత్రి అమిత్ షా మతతత్వాలు రెచ్చగొట్టేలా మాట్లాడంపై సీపీఐ పార్టీ తీవ్రంగా ఖండింస్తున్నట్లు చెప్పారు.
Also Read..
మళ్లీ తెరపైకి ‘‘రాయల తెలంగాణ’’.. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సంచలన డిమాండ్