తిరుమల లేపాక్షి కేంద్రాన్ని తనిఖీ చేసిన చైర్ పర్సన్

by Jakkula Mamatha |   ( Updated:2024-03-07 12:08:13.0  )
తిరుమల లేపాక్షి కేంద్రాన్ని తనిఖీ చేసిన చైర్ పర్సన్
X

దిశ, తిరుమల :గురువారం తిరుమలలో లేపాక్షి ఎంపోరియం కేంద్రాన్ని చైర్ పర్సన్ విజయలక్ష్మి సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ ఏడాది 2023-2024 కు ఇచ్చిన టార్గెట్స్ త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ముఖ్యంగా చేతి మగ్గం ద్వారా నేసిన వస్త్రాలను విక్రయించాలని అక్కడి సిబ్బంది కి సూచించారు.చేతి మగ్గాల ద్వారా తయారు చేసిన చీరలు, వస్త్రాలను మాత్రమే అన్ని లేపాక్షి ఎంపోరియంలో విక్రయించాలని, అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సందర్భంగా లేపాక్షి ఎంపీఎం సిబ్బంది మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో రోజురోజుకు ఖర్చులు పెరిగిపోతున్నాయి. జీతాలు సరిపోవడం లేదంటూ జీతాలు పెంచాలని చైర్ పర్సన్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చైర్పర్సన్ స్పందిస్తూ చేతి వృత్తి కళాకారులు తయారు చేసిన వస్తువులను విరివిగా కొనుగోలు చేసి, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ మధ్యకాలం లో విక్రయించిన రూ. 11లక్షల 90 వేలు భారీ శ్రీకృష్ణుని బొమ్మను ఆమె తిలకించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బడికించల చంద్రమౌళి, తిరుమల లేపాక్షి మేనేజర్ బీపీ వెంకటేశం, జమ్మలమడుగు మున్సిపల్ చైర్ పర్సన్ వేల్పుల శివమ్మ, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామేశ్వరుడు లేపాక్షి ఎంపోరియం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story