- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Tirupati: సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాలని మొక్కులు
దిశ, ఏపీ బ్యూరో: తెలంగాణ సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించాలని కోరుతూ బీఆర్ఎస్నేతలు తిరుపతి అలిపిరి పాదాల వద్ద కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నేత ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమల చేరుకున్నారు.
ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ నేతృత్వంలో పార్టీ బలోపేతమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ సిద్దాంతాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ విస్తరణకు ఆయన విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. టీడీపీ, వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్రాష్ట్రంలో నిరంతర పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్తిరుపతి జిల్లా నాయకులు కల్లూరు బాలసుబ్రహ్మణ్యం, బెల్లంకొండ సురేష్, జ్ఞానేశ్వరి, సాయి కుమార్, రాజేంద్ర పాల్గొన్నారు.