శ్రీవారి సేవలో జాన్వీకపూర్

by srinivas |   ( Updated:2022-12-01 15:46:08.0  )
శ్రీవారి సేవలో జాన్వీకపూర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం జాన్వీకపూర్ కాలి నడకన బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన స్నేహితులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. శ్రీకృష్ణ అతిథిగృహంలో రాత్రికి బసచేశారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆమె దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని మెుక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయం వెలుపల జాన్వీకపూర్‌ను చూసిన అభిమానులు ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు.

ఇక జాన్వీకపూర్ తెలుగుదనం ఉట్టిపడేలా లంగా వోణిలో కనిపించారు. చాలా సింగపుల్‌గా కనిపించారు. నిత్యం గ్లామరస్ ప్రపంచంలో బిజీగా ఉండే జాన్వీ.. లంగా వోణిలో కనిపించేసరికి అంతా ఫిదా అయిపోయారు. శ్రీదేవి ఫ్యామిలీకి ఎంతో ఇష్టదైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంకు జాన్వీకపూర్ తరచూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. గతంలో శ్రీదేవి సైతం తన కుటుంబ సభ్యులను, ఇద్దరు కూతుళ్ళను కూడా తిరుపతికి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఇక్కడ దర్శనం చేయించేవారు. ఇక తల్లి మరణించిన తర్వాత కూడా జాన్వీ కపూర్ తరచుగా శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.

Advertisement

Next Story