Tirupati: ప్రతి రోజూ నిఘా.. ఈ రోజు రూ.2 కోట్ల విలువైన సంపద స్వాధీనం

by srinivas |
Tirupati: ప్రతి రోజూ నిఘా.. ఈ రోజు రూ.2 కోట్ల విలువైన సంపద స్వాధీనం
X

దిశ, తిరుపతి: యల్లమంద క్రాస్ వద్ద భాకరాపేట పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఎర్రచందనం తరలిస్తున్న 9 మందితో పాటు ఐదు వాహనాలతో పాటు 33 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నామన్నారు. ఎక్కడికక్కడ స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నామని చెప్పారు.


ఇక జిల్లాలోని సరిహద్దు చెక్ పోస్ట్‌ల వద్ద సి.సి కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానం చేసినట్లు తెలిపారు. అవసరమైన సిబ్బందిని కూడా చెక్ పోస్ట్‌ల వద్ద నియమించామన్నారు. ప్రతి రోజు విసిబుల్ పోలీసింగ్ నిర్వహించి వాహనాలను తనిఖీ చేస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను కట్టడి చేస్తున్నామన్నారు. ఎర్రచందనం స్మగ్లర్ల, కూలీల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విలువైన సంపదను అక్రమంగా స్మగ్లింగ్ చేసి వ్యాపారం చేయాలనుకుంటే కుదరదని స్మగ్లర్లపై కేసు నమోదు చేయడంతో పాటు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ పి.పరమేశ్వరరెడ్డి హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed