ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, మధుసూదన్‌కి ఊరట.. ఆ కేసు కొట్టివేత

by srinivas |   ( Updated:2023-12-06 13:43:29.0  )
ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, మధుసూదన్‌కి ఊరట.. ఆ కేసు కొట్టివేత
X

దిశ, తిరుపతి: రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి‌పై ఉన్న ఓ కేసును కొట్టివేస్తూ అమరావతిలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తిరుపతి విమానాశ్రయం అధికారులపై దాడి చేశారంటూ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏర్పేడు పోలీస్ స్టేషన్‌లో 2015‌లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి 8 సంవత్సరాల పాటు ఈ కేసు విషయమై వీరు కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు అమరావతి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో బుధవారం విచారణకు రాగా కేసుకు సంబంధించి ఆరోపణలు రుజువు కాలేదు. దీంతో కేసును కొట్టివేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ప్రజా ప్రతినిధుల తరపున న్యాయవాదులు మధుకర్ బాబు, సురేష్, కోటిరెడ్డి వాదనలు వినిపించారు.

Advertisement

Next Story