- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: టీటీడీ ప్రధాన పరిపాలన భవన్‌లో అగ్నిప్రమాదం.. కీలక ఫైళ్లు దగ్ధం
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి టీటీడీ ప్రధాన పరిపాలన భవన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇంజినీరింగ్ విభాగం గదిలో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలు ఫైల్స్ కాలి బూడిదయిపోయాయి. స్థానిక టెంపుల్స్, రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫైల్స్‌గా గుర్తించారు. ఫైల్స్ మొత్తం పాక్షికంగా కాలిపోయాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలంలో మంటలను అదుపు చేశారు. అటు టీటీడీ అధికారులు, పోలీసులు అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే అన్ని ఫైళ్లు ఇప్పటికే ఈ -ఫైలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.
కాగా రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైళ్లు దగ్ధం అవుతున్నాయి. విజయవాడ పొల్యూషన్ బోర్డులో ప్రారంభమైన ఫైళ్ల దగ్ధం పరంపర కొనసాగుతోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ ఫైళ్లు దహనం అయిన ఘటన మర్చిపోకముందే ఈ రోజు ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలోని పత్రాలు దహనం అయ్యాయి. తాజాగా టీటీడీ ప్రధాన పరిపాలన భవన్‌లో ఫైళ్లు దగ్ధం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.