- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడాలి నానిని జీవితకాలంలో చిరంజీవి అభిమానులు క్షమించరు : బొండా ఉమా
దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి కొడాలి నానిని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు జీవితంలో ఎప్పుడూ క్షమించరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి మాజీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను ఆయన అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి వీళ్ళతో మెగా ఫ్యామిలీని ఏ విధంగా తిట్టుస్తున్నాడో అందరికీ తెలుసునన్నారు. చిరంజీవి అభిమనులు ఎవ్వరూ వైసీపీకి ఓటు వెయ్య కూడదని సూచించారు.పద్మభూషణ్ అవార్డు అందుకున్న చిరంజీవిని పకోడీ గాడు, గొట్టం గాడు అంటూ మాజీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను అంతా చూశారని చెప్పుకొచ్చారు.ఇంటికి పిలిచి చిరంజీవినీ, సినీ హీరోలను బయటే నిలబెట్టి జగన్ రెడ్డి ఏ విధంగా అవమానిచాడో అందరూ చూశారని ఈ అవమానాలు ఇప్పటికీ వారి కళ్లకు కట్టినట్లు గుర్తే ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రం మేలు గురించి చిరంజీవి మాట్లాడితే ఆయనను బూతులు తిట్టిన కొడాలి నాని ఇప్పుడు తాను తిట్టలేదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నానిని జీవిత కాలంలో చిరంజీవి అభిమానులు క్షమించరని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా తేల్చి చెప్పారు.