తోడేరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి

by Javid Pasha |
తోడేరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
X

దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున సీఎం జగన్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఇకపోతే తోడేరు బాధిత కుటుంబాల ఆవేదనను మంత్రి కాకాణి గోవర్థణ్ రెడ్డి సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబాలని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఇకపోతే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు శాంతినరగర్‌లోని రత్నగిరి చెరువులో ఆదివారం సాయంత్రం పదిమంది స్నేహితులు బోటు షికారుకు వెళ్లారు.

అయితే చెరువు మధ్యలోకి వెళ్లగా బోటులోకి నీరు వచ్చి చేరింది. దీంతో ఈ విషయాన్ని గమనించిన నలుగురు స్నేహితులు కిందకు దూకేసి ప్రాణాలను రక్షించుకున్నారు. మిగిలిన వారికి ఈత రాక ఉండిపోయారు. దీంతో ఒక్కసారిగా బోటు తిరగబడటంతో వారంతా గల్లంతయ్యారు. ఈ విషయాన్ని స్నేహితులు పోలీసులకు, కుటుంబ సభ్యులుకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం ఉదయం గల్లంతైన పముజుల బాలాజీ(20), బట్టా రఘు(25), అల్లిశ్రీనాథ్(16) మన్నూరు కళ్యాణ్(30), చల్లా ప్రశాంత్ కుమార్(26), పాటి సురేంద్ర(16) మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed