విద్యార్థులకు BIG అలర్ట్.. సిలబస్‌ మార్పుపై సీఎం కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
విద్యార్థులకు BIG అలర్ట్.. సిలబస్‌ మార్పుపై సీఎం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యాశాఖపై అమరావతిలోని సచివాయలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త సంస్కరణలను సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్‌ వివరించారు. విలువలతో కూడిన నాణ్యమైన విద్య అందించడం తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తామని తెలిపారు. ప్రతిభ అవార్డులు, పేరెంట్ మీటింగులు ప్రభుత్వ స్కూళ్లలోనూ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమం కింద స్కూళ్ల అభివృద్ధికి ముందుకు వచ్చే వారికి ప్రొత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లన్నీ ప్రయివేట్ పాఠశాలలతో పోటీ పడాలని సూచించారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు చంద్రబాబుకు వివరించారు. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని చెప్పారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను ఆ ప్రభుత్వం పక్కన పెట్టిందని వివరించారు. నాటి ప్రభుత్వ పరిస్థితులను పూర్తిగా మార్చివేసి.. విద్యలో ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు దృష్టికి అధికారులు తీసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed