- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి పాలైంది. టీడీపీ విజయం సాధించి అధికారాన్ని చేపట్టబోతోంది. దీంతో గత ప్రభుత్వంలో నామినేట్ పదవులు అనుభవించిన వారంతా తమ పదవులకు రాజీనామా చేస్తు్న్నారు. ఇప్పటికే మొత్తం కార్పొరేషన్ పదవులకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేశారు. తాజాగా తుడా చైర్మన్ పదవితో పాటు టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవికి కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడే మోహిత్ రెడ్డి. 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుంచి గెలిచారు. దీంతో ఆయన తనయుడు మోహిత్ రెడ్డిని తుడా చైర్మన్‌గా చేసుకున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి మోహిత్ రెడ్డి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఓటమి పాలయ్యారు. అంతేకాదు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలై అధికారాన్ని పోగొట్టుకుంది. దీంతో నామినేటెడ్ పదవులు తీసుకున్న నాయకులంతా రాజీనామాలు చేస్తున్నారు. వారి బాటలోనే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా నడిచారు. తనకు తుడా చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు మోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపుతూ ఆ పదవికి రాజీనామా చేశారు.