- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IT Searches: గ్రంధి శ్రీనివాస్ ఇంట్లో భారీగా నగదు, విలువైన ఫైల్స్ స్వాధీనం ..!
దిశ, వెబ్ డెస్క్: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్(YCP MLA Grandhi Srinivas) ఇంట్లో నిర్వహించిన ఐటీ అధికారుల(IT officers) సోదాల్లో విలువైన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఐదు రోజులుగా గ్రంధి శ్రీనివాస్‌తో పాటు ఆయన బంధువులు, అనుచరులు ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆదివారం సైతం ఐటీ అధికారులు దాడులు కొనసాగించారు. చెన్నై నుంచి వచ్చిన అధికారులు గ్రంధి శ్రీనివాస్ ఇంటితో పాటు భీమవరంలోని పలువురు ప్రముఖుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు, కీలక ఫైల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అయినా సరే ఇంకా అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో గ్రంధి శ్రీనివాస్‌కు పలు వ్యాపారాలు ఉన్నాయి. పన్నులు ఎగవేశారన్న ఆరోపణల నేపథ్యంలో చెన్నైకు చెందిన ఐటీ అధికారులు గ్రంధి శ్రీనివాస్‌తో పాటు ఆయన బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.