AP News:చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి: సచ్చిదానంద స్వామి

by Jakkula Mamatha |   ( Updated:2025-01-03 10:36:32.0  )
AP News:చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి: సచ్చిదానంద స్వామి
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నేడు(శుక్రవారం) మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడ(Vijayawada)లోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వామీజీని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా అని సీఎం చంద్రబాబు(AP CM Chandrababu) తెలిపారు. సచ్చిదానంద స్వామీజీ ఆశీస్సులు తీసుకున్న అన్నారు. సమాజ హితం కోసమే సచ్చిదానంద స్వామి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నా కష్టాలు తొలగాలని పూజలు చేసి నాకు ప్రసాదం అందించారు. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేయడమే నా కల.. 2047 నాటికి స్వర్ణాంధ్ర సాధనే నా లక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో సచ్చిదానంద స్వామీజీ మాట్లాడుతూ.. ‘‘కృష్ణానది ఒడ్డున జరిగిన సభను మర్చిపోలేను అని తెలిపారు. చంద్రబాబు కర్మ యోగి. చంద్రబాబు సంకల్పించిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్ర కావడం తథ్యం’’ అని పేర్కొన్నారు. ఆశ్రమంలో వివిధ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు సచ్చిదానంద స్వామి(Satchidananda Swami) ఆశ్రమం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరవుతారు.

Advertisement

Next Story

Most Viewed