- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయ స్థాయిలో చంద్రబాబు వ్యూహం.. తెలంగాణపై ప్రత్యేక ఫోకస్..?
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారానికి రావడంతో టీడీపీకి మరింత ఊపునిచ్చింది. ఇదే ఒరవడితో తెలంగాణలోనూ పాగా వేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. భాషాపరంగా పార్టీ విస్తరణకు అవకాశం ఉన్నది కూడా అక్కడే. ప్రస్తుతం కేంద్ర సర్కారు ఏర్పాటు లో టీడీపీ కీలక పాత్ర పోషించిన అత్యధిక ఎంపీలున్నా రాష్ట్రాలకు దక్కిన ప్రాధాన్యం రాష్ట్రానికి అంతగా లేదు. ఇప్పటికే నిధుల కేటాయింపులో బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాధాన్యత రాష్ట్రానికి దక్కడం లేదు. రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో సాయం అందించడానికి బదులు అప్పులకు అనుమతులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
భవిష్యత్తులో ఎంత ఎక్కువ మంది ఎంపీలుంటే కేంద్రంలో అంతటి పలుకుబడి ఉంటుందని సీఎం చంద్రబాబు గ్రహించినట్లుంది. ఈపాటికే తెలంగాణలోని కొన్ని దక్షిణ జిల్లాలో టీడీపీకి పట్టుంది. దీన్ని రాష్ట్రమంతటా విస్తరించడానికి ప్రణాళికాబద్దంగా కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రధానంగా బీసీలు, యువత, సెటిలర్స్‌పై దృష్టి సారించనున్నారు. మొన్నామధ్య చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని 2028 ఎన్నికల నాటికి తెలంగాణలో పచ్చ జెండా రెపరెపలాడించాలని భావిస్తున్నారు.
2028 నాటికి తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యం
తెలంగాణలో బీఆర్ఎస్ ఇప్పట్లో పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు. బీజేపీతో దాగుడుమూతలు ఆడిన ఫలితంగా ఆ పార్టీ కోలుకోలేకపోతోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురు దాడి చేయడం కన్నా క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసిన తర్వాత తగు నిర్ణయం తీసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో టీడీపీ కొన్ని ఎంపీ సీట్లు సాధించినా కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి సీఎం చంద్రబాబు పూర్తిగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.