- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు... న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి: పవన్ కల్యాణ్
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు అని అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి అమానవీయంగా ఉంది అని అభిప్రాయపడ్డారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబు ఆరోగ్య స్థితిగతుల విషయంలో నిర్లక్ష్యం తగదు అని హెచ్చరించారు. చంద్రబాబు వయసును దృష్టిలో ఉంచుకోవడంతోపాటు... ఆయన ఎదుర్కొంటున్న ఆరోగ్యపరమైన సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలి అని సూచించారు. ఈ అంశంలోనూ రాజకీయ కక్ష సాధింపు ధోరణి సరికాదు అని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు సామాజిక మాధ్యమాలు , మీడియా ద్వారా ఆందోళన చెందితే ప్రభుత్వ సలహాదారులు , జైళ్ల శాఖ అధికారులు చేసిన వ్యాఖ్యలు.. ప్రభుత్వ వైఖరిని సూచిస్తున్నాయి అని వ్యాఖ్యానించారు. వైద్యుల నివేదికలను పట్టించుకోకపోవడం...చంద్రబాబు విషయంలో ప్రభుత్వ వైఖరిపై న్యాయస్థానం జోక్యం చేసుకొని విచారణ చేపట్టాలి అని కోరారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.