Breaking News: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ విచారణ నేడే..

by Indraja |
Breaking News: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ విచారణ నేడే..
X

దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జైలుకి వెళ్లిన విషయం అందరికి సుపరిచితమే. మొదట ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన జైలుకి వెళ్లిన అనంతరం సీఐడీ ద్రుష్టి సారించింది. ఈ నేపథ్యంలో అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, మద్యం, ఇసుక ఇలా పలు అంశాల్లో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడినట్లు ద్రువీకరించి కేసులు నమోదు చేసింది సీఐడీ.

దీనితో మూడు కేసులకు గాను నారా చంద్రబాబు నాయుడు ముందస్తు బైలు కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు మొదట మధ్యంతర బెయిల్‌ ను మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే సీఐడీ నమోదు చేసిన ఐఆర్‌ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో కూడా ముందస్తు బెయిల్‌ పొందేందుకు హైకోర్టును ఆశ్రయించారు చంద్రబాబు. కాగా ఈ కేసుల్లో హైకోర్టు విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని కేసులకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు వెలువరించనుంది. దీంతో.. హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed