- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చంద్రబాబు..కాసేపట్లో ఆపరేషన్
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇప్పటికే ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రిలో చంద్రబాబు నాయుడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అయితే కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పలు సూచనలు చేశారు. దీంతో ఏఐజీ ఆస్పత్రిలో ఇతర సమస్యలకు సంబంధించి మరోసారి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మంగళవారం కాటరాక్ట్ ఆపరేషన్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంగళవారం జూబ్లీ హిల్స్‌లోని తన నివాసం నుంచి చంద్రబాబు నాయుడు ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి చేరుకున్నారు. మరికాసేపట్లో చంద్రబాబు కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోనున్నారు. ఇదిలా ఉంటే గతంంలో అంటే నాలుగు నెలలక్రితం చంద్రబాబు నాయుడు ఓ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. అనంతరం ఐదు నెలలలోపు మరో కంటికి కూడా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. కానీ చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో అరెస్టై రాజమహేంద్రవరం జైలులో 52 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. రిమాండ్‌లో ఉన్నప్పుడు స్కిన్ అలర్జీ, ఫిసర్ సమస్యలతోపాటు కంటి సమస్యలతో బాధపడ్డారు. దీంతో ఏపీ హైకోర్టు చంద్రబాబు నాయుడుకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాలపాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్‌పై నుంచి విడుదలైన చంద్రబాబు నాయుడు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించుకున్న సంగతి తెలిసిందే.