AP Politics:‘చంద్రబాబు..ఇక ఆపండి’..వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |
AP Politics:‘చంద్రబాబు..ఇక ఆపండి’..వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం పై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోందన్నారు. ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయందన్నారు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమ పార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతున్నాయని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ సీఎం చంద్రబాబు పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వైసీపీ కార్యకర్తలపై దాడులతో చంద్రబాబు ఏం సాధిస్తారని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. పాలనపై దృష్టి పెట్టకుండా దాడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు సంప్రదాయాలను ఇంతటితో ఆపాలని సీఎం చంద్రబాబుకు చెబుతున్నా అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే రేపు మేం అధికారంలోకి వచ్చాక ఆగమన్నా.. మా కార్యకర్తలు ఆగే పరిస్థితి ఉండదు అని తెలిపారు. ఇప్పటికైన గవర్నర్ జోక్యం చేసుకోవాలి. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం అని వైఎస్ జగన్ వెల్లడించారు.

Advertisement

Next Story