- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చంద్రబాబును తరలింపు..? వీవీఐపీ రూమ్ రెడీ..!
దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబును రాజమండ్రిలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు జైలు అధికారులు తరలించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు దీనికి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే జీజీహెచ్‌లో చంద్రబాబు కోసం ప్రత్యేక వీవీఐపీ రూమ్‌ను ఆస్పత్రి సిబ్బంది సిద్దం చేసినట్లు చెబుతున్నారు. శుక్రవారం అర్ధరాత్రి హడావిడిగా వీవీఐపీ రూమ్‌తో పాటు పరిసరాలను పారిశుద్ధ కార్మికులు శుభ్రం చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఆసుపత్రిలో అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు అనారోగ్యం మరింత తీవ్రమైందని, చర్మం రంగు మారినట్లు రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు జైలు అధికారులకు ఒక నివేదిక ఇచ్చారు. డీహైడ్రేషన్‌తో చంద్రబాబు బాధపడుతున్నారని, చల్లని వాతావరణంలో ఉంచాలని సూచించారు.
స్కిన్ అలెర్జీతో పాటు ఇన్పెక్షన్ సమస్యలు ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. దీంతో చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తోన్నారు. ఈ క్రమంలో మెరుగైన వైద్య చికిత్స కోసం చంద్రబాబును జీజీహెచ్‌లోని వీఐపీ వార్డ్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.