AP News:చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..ఆ నలుగురికి శాఖల కేటాయింపు

by Jakkula Mamatha |   ( Updated:2024-07-20 15:12:27.0  )
AP News:చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం..ఆ నలుగురికి శాఖల కేటాయింపు
X

దిశ, డైనమిక్‌ బ్యూరో:రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు కార్యాలయంలోని నలుగురు అధికారులకు శాఖలను శనివారం ఖరారు చేసింది. వారు పర్యవేక్షించాల్సిన శాఖలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ముద్దాడ రవిచంద్ర, ఏవీ రాజమౌళి, ప్రద్యుమ్న, కార్తికేయ మిశ్రాకు పలు విభాగాలను అప్పగించింది. ఇక నుంచి రవిచంద్ర సీఎం కార్యాలయం, సాధారణ పరిపాలన శాఖ, హోం, ఆర్థిక, ఎక్సైజ్‌, రెవెన్యూ, దేవాదాయ శాఖలను చూడనున్నారు. రాజమౌళికి, జలవనరులు, విద్యుత్‌, గనులు వ్యవసాయం, సీఎంఆర్‌ఎఫ్‌, ఫిర్యాదులు తదితర శాఖలను కేటాయించారు. అదేవిధంగా ప్రద్యుమ్నకు రవాణా, పురపాలక, పంచాయతీరాజ్‌, ఆర్టీజీఎస్‌, అటవీ, పౌరసరఫరాల శాఖలను, కార్తికేయకు ఐటీ, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, సమాచార పౌర సంబంధాలు, సీఎం ఢిల్లీ, విదేశీ పర్యటనలను చూడనున్నారు.

Read More..

AP News:‘ఏపీలో సినీ ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే..ఆ కండీషన్లు పెట్టకూడదు’..సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story