- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల
దిశ, వెబ్‌డెస్క్: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల అయ్యారు. దాదాపు 52 రోజుల తర్వాత ఆయన మంగళవారం బయటకు వచ్చారు. టీడీపీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బాబు అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇస్తున్నట్లు ఏపీ హైకోర్టు పేర్కొంది.
కాగా, సెంట్రల్ జైలు నుంచి బాబు విడుదల కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును చూసేందుకు భారీ స్థాయిలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోటెత్తారు. అయితే ఎక్కడికెక్కడ టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు. అయినప్పటికీ వారిని దాటుకుని మరీ సెంట్రల్ జైలు వద్దకు నేతలు, అభిమానులు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ జైలు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇన్నాళ్లు రాజమహేంద్రవరం సెంటర్ జైలు గేటు వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీగా కాపలా కాశారు. అయితే ఇప్పుడు చంద్రబాబు కోసం ఒక్కసారిగా ప్రధాన గేటు వద్దకు వేలల్లో తెలుగుదేశం పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో పోలీసులు చేతెలెత్తేసే పరిస్థితి ఏర్పడింది. జైలు ఎదుట నిలబడి జై చంద్రబాబు అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు.
Read More..
చంద్రబాబు మీడియాతో మాట్లాడొద్దు.. రాజకీయం ప్రసంగం చేయకుండా ఆదేశించండి: ఏపీ హైకోర్టులో సీఐడీ పిటిషన్