- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముగ్గురు నేతలతో భేటీ... ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు. అయితే టికెట్ దక్కని నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయా పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు పార్టీ కార్యాలయాలపై దాడి చేశారు. అధినేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే వారి పరిస్థితిని అర్ధం చేసుకున్న టీడీపీ, జనసేన అధినేతలు టికెట్ దక్కని నేతలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాని కొందరు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు అలకవీడి పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారు.
తాజాగా చంద్రబాబు అసంతృప్తుల నేతలను కలిశారు. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, గుంతకల్లు టీడీపీ ఇంచార్జి జితేందర్ గౌడ్, మంత్రాలయం ఇంచార్జి తిక్కారెడ్డిని ఆయన బుజ్జగించారు. అంతేకాదు ఆ మూడు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలతోనూ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ముగ్గురికీ పదవులు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సీట్ల సర్దుబాటును అర్థం చేసుకుని సహకరించాలని సూచించారు. చంద్రబాబు హామీ ఇవ్వడంతో ప్రభాకర్ చౌదరి, జితేందర్ గౌడ్, తిక్కారెడ్డి సంతృప్తి చెందారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అంగీకరించారు. దీంతో మూడు నియోజకవర్గాల్లో అసంతృప్తికి తెరపడింది.