- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు నాయుడు అరెస్ట్ కుట్రపూరితం: బీవీ రాఘవులు
దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన తీరుపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండా చంద్రబాబుని అరెస్టు చేశారని మండిపడ్డారు. సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని అభిప్రాయపడ్డారు. సరైన సాక్ష్యాధారాలు దొరికతే చంద్రబాబు నాయుడైనా, వైఎస్ జగన్ అయినా ఎవరినైనా సరే తప్పకుండా అరెస్ట్ చేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. అర్థరాత్రి వేలాదిమంది పోలీసులు మోహరించి, ఎఫ్‌ఐఆర్‌లో పేరు కూడా లేకుండా అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. ఈ అరెస్ట్ చేసిన తీరు చాలా అభ్యంతరకరంగా... కక్ష సాధింపు చర్యలా ఉందని అన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయాలనే ఆతృత కనిపించిందే తప్ప పారదర్శకంగా విచారణ చేపడదామనే భావన ఎక్కడా కనిపించలేదన్నారు. 2021 నుంచి విచారణ జరుగుతున్న ఈకేసులో అకస్మాత్తుగా.. ముందస్తు అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేయడం కుట్రపూరితం కాక ఇంకేమిటన్నారు. ఇలాంటి దుర్మార్గపు రాజకీయాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపునిచ్చారు.