- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ పాలిట విలన్ చంద్రబాబు : మంత్రి విడదల రజని
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాలిట టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విలన్‌గా మారారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో పన్నుల భారం మోపి, ఇష్టారీతిన విద్యుత్ చార్జీలు పెంచి, పెట్రోల్, డీజిల్‌పై అదనపు వ్యాట్ విధించి ప్రజలను కోలుకోలేని దెబ్బతీశారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అరాచక పాలన సాగించారంటూ ధ్వజమెత్తారు. ఇప్పుడేమో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధిని అడ్డుకునేందుకు అడుగడుగునా కుట్రలు పన్నుతున్నారని మంత్రి విడదల రజని ధ్వజమెత్తారు. టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు చేసిన ఆరోపణలను మంత్రి విడదల రజని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా విద్యుత్ చార్జీలు పెంచారని చంద్రబాబు అనడం సిగ్గుచేటని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు విద్యుత్ చార్జీలను పెంచలేదా అని నిలదీశారు. 2015 ఫిబ్రవరిలో పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.4 అదనపు వ్యాట్ విధించిన చరిత్ర చంద్రబాబుదేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బెల్టుషాపుల వ్యవస్థను సృష్టించిన చంద్రబాబు.. మద్యపాన నిషేధాన్ని సైతం ఎత్తివేశారని.. అలాంటి వ్యక్తి నేడు మద్యం గురించి మాట్లాడుతుండటం సిగ్గుచేటని మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఊరూరా మద్యం అమ్ముకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టుషాపులన్నింటినీ రద్దు చేసిందని స్పష్టం చేశారు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలను మభ్య పెట్టేందుకు టిడ్కో ఇళ్లను తెరపైకి తెచ్చారని విరుచుకుపడ్డారు. అందుకే ప్రజలు టీడీపీకి తగిన విధంగా బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో ఎన్ని హత్యలు జరిగాయో, మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో, టీడీపీ గుండాలు ఎలా రెచ్చిపోయారో ప్రజలింకా మర్చిపోలేదని మంత్రి విడదల రజనీ చెప్పుకొచ్చారు.