పెన్షన్ దారులకు చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. రూ.4,400 కోట్ల ఫండ్స్ రిలీజ్

by Satheesh |
పెన్షన్ దారులకు చంద్రబాబు భారీ గుడ్ న్యూస్.. రూ.4,400 కోట్ల ఫండ్స్ రిలీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: పెన్షన్‌దారులకు చంద్రబాబు ప్రభుత్వం భారీ గుడ్ న్యూ్స్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిమిత్తం రూ.4,400 కోట్ల నిధులను శనివారం విడుదల చేసింది. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి అన్ని జిల్లాలో కలెక్టర్లతో సీఎస్ నీరభ్ కుమార్ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. జూలై 1వ తేదీన 65.18 లక్షల మంది లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు. సోమవారం ఉదయం 6 గంటలకే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని ఆదేశించారు.

అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు పెన్షన్ల పంపిణీని గంట గంటకూ పర్యవేక్షించాలని సూచించారు. పెన్షన్ల పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని చెప్పారు. కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని పెనుమాకలో స్వయంగా లబ్ధిదారులకు చంద్రబాబు పెన్షన్ అందించనున్నారు.

Next Story

Most Viewed