అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు

by Kalyani |
అమల్లోకి వచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు
X

దిశ, నారాయణపేట క్రైం : జులై ఒకటి నుండి కొత్త చట్టాలు అమల్లోకి వచ్చాయని నారాయణపేట సీఐ శివశంకర్, టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు కొత్త చట్టాలైన సిఆర్పిసి బదులు (బిఎన్ ఎస్ ఎస్) భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఐపీసీ స్థానంలో (బిఎన్ఎస్) భారతీయ న్యాయ సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో బిఎస్ఏ భారతీయ సాక్షాయ అధినియం-2023 ఈ నూతన చట్టాల ద్వారా ఇక ఎక్కడి నుంచైనా ఎఫైర్ నమోదు చేసే అవకాశం ఉంటుందని అన్నారు.

పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఆన్లైన్లో ఎఫైర్ నమోదు చేసుకోవచ్చని ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడానికి ఫిర్యాదు దారుని డిజిటల్ సిగ్నేచర్ తప్పకుండా ఉండాలన్నారు. లేని ఎడల మూడు రోజుల్లో పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం చేయాలని అప్పుడు కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆడియో, వీడియో సాక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. మహిళలు చిన్నారులపై జరిగిన నేరాలపై రెండు నెలల్లో దర్యాప్తు చేయాలని... ఉచితంగా ఎఫైర్ చేసి పొందే అవకాశం ఉంటుందన్నారు. పోలీస్ శాఖ తరపున ప్రజలకు సరైన న్యాయం అందించి, నేరస్తులకు త్వరగా శిక్షలు వేయించడానికి ఈ చట్టాల ద్వారా అవకాశం ఉంటుందని వారు తెలిపారు.

Next Story

Most Viewed