చంద్రబాబుకు భారీ ఊరట.. కీలక తీర్పు ఇచ్చిన ఏసీబీ కోర్టు

by Javid Pasha |   ( Updated:2023-10-20 14:53:36.0  )
చంద్రబాబుకు భారీ ఊరట.. కీలక తీర్పు ఇచ్చిన ఏసీబీ కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఆయనకు లీగల్ ములాఖత్‌లను పెంచుతూ వియయవాడలోని ఏసీబీ కోర్టు నిర్ణయం తీసుకుంది. రోజుకు రెండుసార్లు న్యాయవాదులు చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు అవకాశం కల్పించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాదుల ములాఖత్‌లను రెండు నుంచి ఒకటికి తగ్గిస్తూ ఇటీవల జైలు అధికారులు నిర్ణయించారు. దీనిపై చంద్రబాబు కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

జైలు అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. రోజుకు మూడుసార్లు ములాఖత్‌కు అవకాశం కల్పించాలని కోరారు. కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చంద్రబాబు పిటిషన్లపై విచారణ జరుగుతున్నందున ఆయనతో మాట్లాడేందుకు ములాఖత్‌లు పెంచాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ములాఖత్‌ల సంఖ్యను తగ్గించి జైళ్లశాఖ తమను ఇబ్బంది పెడుతుందని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. రెండు ములాఖత్‌లకు అనుమతిస్తూ శుక్రవారం సాయంత్రం మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. దీంతో న్యాయపరంగా ములాఖత్‌లకి సంబంధించి బాబుకు ఉపశమనం దక్కింది.

Advertisement

Next Story

Most Viewed