- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CID custody to Chandrababu : సీఐడీ కస్టడీకి చంద్రబాబు : జడ్జి షరతులు ఇవే
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారించాలన్న సీఐడీ తరఫు న్యాయవాది వాదనలతో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఏకీ భవించారు. ఈ మేరకు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారించేందుకు జడ్జి అనుమతించారు. విచారణకు సంబంధించి సీఐడీకి జడ్జి పలు షరతులు విధించారు. ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపే విచారణ జరపాలని జడ్జి ఆదేశించారు. చంద్రబాబు నాయుడును విచారించే సీఐడీ అధికారుల పేర్ల జాబితాను అందజేయాలని ఏసీబీ కోర్టు సీఐడీని ఆదేశించింది. కేవలం న్యాయవాదుల సమక్షంలో నే విచారణ జరపాలి అని న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అంతేకాదు ఇద్దరు న్యాయమూర్తులు విచారణకు హాజరయ్యేలా అనుమతినిచ్చారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫోటోలు విడుదల చేయరాదని జడ్జి తెలిపారు.
విచారణ వివరాలను మీడియాకు వెల్లడించకూడదని ఆదేశించింది. కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.చంద్రబాబు ఆరోగ్యం, వయస్సు దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చంద్రబాబు విచారణను తాము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం అని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఆదివారం కస్టడీ ముగిసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు.