తంతే మూడు జిల్లాల అవుతల పడ్డాడు.. మాజీమంత్రిపై చంద్రబాబు ఫైర్

by Ramesh Goud |   ( Updated:2024-03-06 15:43:33.0  )
తంతే మూడు జిల్లాల అవుతల పడ్డాడు.. మాజీమంత్రిపై చంద్రబాబు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలో ఎన్నికల వేళ అధికార ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై విరుచుకుపడ్డారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవ్వాళ టీడీపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఒక నాయకుడు ఉండేవాడని, ఆయన నెల్లూరు నడివీదిలో ఎగిరెగిరి పడ్డాడని మండిపడ్డారు.

ఆయన మంత్రి అయ్యాక ఒంటి మీద బట్టలు కూడా ఆగలేదని, కన్ను మిన్నూ కనపడకుండా ప్రవర్తించాడని, మన ఖర్మ అలాంటి కూడా మంత్రి అయ్యాడని దుయ్యబట్టారు. మొన్న జరిగిన బదిలీలో ఒక్క తన్ను తంతే.. పక్క జిల్లా కూడా కాదు. మూడు జిల్లాల అవుతల పడిపోయాడని ఎద్దేవా చేశారు. ఆయన ఒకప్పుడు బుల్లెట్ దిగిందా.. అని డైలాగులు కొట్టే వాడని, ఇప్పుడు ఆయనకే బుల్లెట్ గట్టిగా దిగిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపు పల్నాడులో బుల్లెట్ దిగాక, మళ్లీ తిరుగు తపాళాలో చెన్నై వెళ్లి పడతాడని తీవ్ర స్తాయిలో విమర్శలు చేశారు.

Advertisement

Next Story