సినిమా సెట్టింగ్‌లతో ప్రజలను మోసం చేశారు: చంద్రబాబు

by GSrikanth |
సినిమా సెట్టింగ్‌లతో ప్రజలను మోసం చేశారు: చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తాను పోటీ చేస్తోన్న కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిని రాజధానిగా ప్రకటిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందుకు జగన్ కంటే తానే ఎక్కువ అభివృద్ధి చేశాను.. నీళ్లు తెచ్చింది కూడా తానే అని చంద్రబాబు అన్నారు. జగన్ ప్రభుత్వం పెండింగ్ పనులను 10 శాతం కూడా పూర్తి చేయలేకపోయింది.. సినిమా సెట్టింగులతో ప్రజలను మోసం చేశారు అని విమర్శించారు.

టీడీపీ ప్రభుత్వం రాగానే 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం పెడతామని చంద్రబాబు నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన డీఎస్సీని కొనసాగిస్తే తమకు అనుకూలమైన వారిని నియమించుకునే ప్రమాదం ఉంటుందని చంద్రబాబు తెలిపారు. దీనిపై ఎన్నికల కమిషన్ తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకూ నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story