- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Maharashtra : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ తరుపున ఎన్నికల ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు(Chandrababu ), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) లు రేపు శనివారం మహారాష్ట్ర చేరుకోనున్నారు. చంద్రబాబు నాయుడుశుక్రవారం ఢిల్లీకి చేరుకుని పలువురు కేంద్ర మంత్రులతో రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై భేటీ అవుతారు. అనంతరం బీజేపీ పెద్ధలతో భేటీ అనంతరం శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు బయలుదేరి ఎన్డీయే తరఫున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్సైతం రేపు మహారాష్ట్ర చేరుకుని ఎన్డీఏ అభ్యర్థుల గెలుపు కోరుతూ ప్రచారం చేస్తారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ఎన్నికల ప్రచారాన్ని తెలుగు వారు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ఖరారు చేశారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20వ తేదీన జరగనున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బరిలో రెండు కూటముల మధ్య రసవత్తర పోరు జరుగుతుంది.
ఇండియా కూటమిలోని ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (ఉద్దవ్ ఠాక్రే), కాంగ్రెస్ పార్టీలు కలగలిసి మహా వికాస్ అఘాడీగా ఏర్పాటయ్యాయి. ఎన్డీఏ కూటమిలోని ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (షిండే), బీజేపీ కలిసి మహాయుతీగా అవతరించాయి. మహారాష్ట్రలో ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని మహాయుతీ కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీంతో బీజేపీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్ష పార్టీల అధినేతలను ప్రచార బరిలోకి దించుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సైతం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి విడత ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి రేపటి నుండి మళ్లీ మూడు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో మహాయుతీని గద్దె దించి బీజేపీ ఫిరాయింపు, చీలిక రాజకీయాలకు గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతో మహా వికాస్ అఘాడీ భాగస్వామ్య పక్షాలు పట్టుదలగా ఎన్నికల సమరాన్ని సాగిస్తు్న్నాయి. మహారాష్ట్ర ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటరు పట్టం కడతాడనేది నవంబర్ 23వ తేదీన ఫలితాల్లో తేలిపోనుంది.