- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబు దూకుడు: నేడు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ కార్యకలాపాల్లో స్పీడు పెంచనున్నారు. స్కిల్ స్కాం కేసులో 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు అనంతరం మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ వచ్చింది. మధ్యంతర బెయిల్‌పై విధించిన షరతులు తొలగిపోవడంతో చంద్రబాబు నాయుడు ఇక దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్నారు.ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి అమరావతి చేరుకుంటారు. అనంతరం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి లోక్‌సభలో అనుసరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు.
పార్లమెంట్‌లో పోరాటంపై చర్చ
ఇకపోతే డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ వేదికగా వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు.. రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టడంతోపాటు ప్రతిపక్షాలను అక్రమ కేసులతో వేధింపులకు గురి చేయడం వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టే విషయంపై ఎంపీలకు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.