- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎస్ఎమ్‌లో అసభ్య పోస్టులు, దుష్ప్రచారాలు: తొలిసారి గళం విప్పిన చాగంటి కోటేశ్వరరావు
దిశ, వెబ్ డెస్క్: గత కొంతకాలంలో సోషల్ మీడియా(Social media)లో అసభ్య పోస్టులు, దుష్ప్రచారాలు(Malicious propaganda) పెట్రేగిపోతున్న విషయం తెలిసిందే. ఈ విష ప్రచారాలతో కొందరు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం(AP Govt) వినూత్నంగా ఆలోచన చేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు, ప్రచారాలతో జరిగే నష్టంపై వినియోగదారులకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమం చేపట్టింది. చెడు చూడకు, మాట్లాడకు, వినకు అని సూచించే కోతి బొమ్మలను ముద్రించిన హోర్డింగులను పలు నగరాలు, పట్టణాల్లో విస్తృతంగా ఏర్పాటు చేసింది.
అయితే ఈ అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, ప్రవచన కర్త, ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao) గళం విప్పారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియా ద్వారా వీడియో సందేశాన్ని తెలిపారు. ‘‘సోషల్ మీడియాను మంచి కోసం వినియోగిద్దాం. అసత్య ప్రచారాలు, దూషణలు చేయవద్దు. ఒకరిని పరుషంగా మాట్లాడవద్దు, వాళ్లు కూడా అంతే పరుషంగా మాట్లాడితే ఎంత బాధ కలుగుతుందో అర్ధం చేసుకోవాలి. మనం అనే మాటలతో ఎదుటి వారు బాధపడతారని తెలిసినప్పుడు అలా అనడం ఎందుకు?, తము చేసే పనులతో ఎదుటి వాడిని దు:ఖించొద్దు. చెడు కలుగుతుందని తెలిస్తే వెంటనే ఆపేయండి. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి. సమస్త భూమండలంలో మాట్లాడగలిగే జీవ రాశి ఒక్క మానిషి మాత్రమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. మనిషి మాట్లాడే ప్రతి వాక్కు ఎదుటి వాడిని సంతోషింపజేయాలి. వారి మనసులు గాయపర్చేలా మాట్లాడవద్దు. అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో మంచి పనులకు మాత్రమే వాడుకోవాలి. తప్పుగా మాట్లాడి ఇతరుల మనస్సులను గాయపర్చొద్దు. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులను, మహిళలను ఉద్దేశించి అసభ్య పోస్టులు అసలు పెట్టవద్దు. ప్రతి ఒక్కరూ తమను తాము నియంత్రించుకోవాలి. సభ్యత, సంస్కారాలు చాటుకోవాలి.’’ అని సోషల్ మీడియా వినియోగదారులకు చాగంటి కోటేశ్వరరావు సూచించారు.