సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య.. ఘటనపై పోలీసుల ఆరా

by Ramesh Goud |
సెంట్రల్ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ ఆత్మహత్య.. ఘటనపై పోలీసుల ఆరా
X

దిశ, వెబ్ డెస్క్: సెంట్రల్ యూనివర్సిటీ(Central University) ప్రొఫెసర్ ఆత్మహత్య (Suicide) చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా (Ananthpuram District) బుక్కరాయ సముద్రం (Bukkaraya Samudram) మండల కేంద్రంలో జరిగింది. చత్తీస్ గఢ్ రాష్ట్రం (Chattis Ghar) రాయ్ పూర్ (Raypur) కు చెందిన యోజిత సాహో అనే మహిళ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ (Professor) గా విధులు నిర్వహిస్తోంది. శనివారం ఆమె తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఇది గమణించిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని కిందికి దింపి పంచనామా నిర్వహించారు. డెడ్ బాడీని (Dead body) పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యోజిత ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

Next Story