- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం కితాబు
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఆధునిక భారత నిర్మాణం జరుగుతోంది అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ ఏపీలో చాలా బాగా పనిచేస్తోంది అని కితాబు ఇచ్చారు. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మంచి పనులు చేయడానికి తన వద్దకు వస్తారని గుర్తు చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచీ పూర్తి స్ధాయి మద్దతు ఉంటుంది అని స్పష్టం చేశారు. రాష్ట్రం ఆరోగ్య సేవలకు చేసే ఖర్చుకు నిధులు ఇవ్వడానికి కేంద్రం వెనుకాడదు అని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. విజయవాడ ఓల్డ్ జీజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. క్రిటికల్ కేర్ ల్యాబ్, బిఎస్ఎల్ - 3 ల్యాబ్ లకు శంఖుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఆరోగ్యకరమైన సమాజం దేశాన్ని సమృద్ధిగా మారుస్తుంది అని అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేవలు అందరికీ అందుబాటులో ఉండాలి అని సూచించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్ ఆరోగ్య కేంద్రాలలో 10 రకాల టెస్టులు జరుగుతాయి అని వెల్లడించారు. ఆసుపత్రులు కట్టినా డాక్టర్లు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు తీసుకువచ్చాం అని కేంద్రమంత్రి తెలిపారు. 107,000 మెడికల్ సీట్లు దేశంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా 3 నుంచీ 4 లక్షలు టెలీ కన్సల్టేషన్లు జరుగుతున్నట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వానికి థ్యాంక్స్: మంత్రి విడదల రజిని
రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ కోసం కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సహకారం అందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. పీఏం ఆయుష్మాన్ భారత్ ప్రజలకు చాలా ఉపయోగకరమైన పథకం అని చెప్పుకొచ్చారు. బీఎస్ఎన్‌ఎల్-3 ల్యాబ్ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలో భవిష్యత్తుకు ఉపయోగపడేలా కూడా పథకాలు వచ్చాయి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు.
రూ.23 కోట్లు కేటాయించడం సంతోషం: ఎంపీ కేశినేని నాని