AP Politics: ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ రాజీవ్ వీడియో కాన్ఫరెన్స్

by Indraja |   ( Updated:2024-04-03 12:59:29.0  )
AP Politics: ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ రాజీవ్ వీడియో కాన్ఫరెన్స్
X

దిశ వెబ్ డెస్క్: ఓవైపు పార్టీల ప్రచారాలు మరో వైపు ఎన్నికల అధికారుల ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రాలో అమలైన ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న ఎన్నికల అధికారులు పొరపాటున ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన వారిపై ఉక్కుపాదం మోపుతున్న విషయం సుపరిచితమే.

కాగా రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలకు, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకూడదనే దృఢ సంకల్పంతో ఎన్నికల అధికారులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజగా ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ రాజీవ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఏపీ సీఎస్, సీఈవో పాల్గొన్నారు. కాగా ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో చేపట్టాల్సిన శాంతిభద్రతలు గురించి అలానే భద్రతాబలగాల మోహరింపుపై చర్చించారని సమాచారం.

Read More..

స్వపక్షంలో విపక్షం

Advertisement

Next Story